'విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి'
SRD: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. ఇస్మాయిల్ ఖాన్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన సమావేశం నిర్వహించారు. 14 ఏళ్లలోపు బాల బాలికలకు ప్రభుత్వం అనేక హక్కులు కల్పించిందని చెప్పారు. బాలికలను ఎవరైనా వేధిస్తే నేరుగా ప్రధానోపాధ్యాయుని ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.