బుచ్చినాయుడు కండ్రిగలో 15 కేజీల గంజాయి స్వాధీనం

బుచ్చినాయుడు కండ్రిగలో 15 కేజీల గంజాయి స్వాధీనం

TPT: బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని ఏఎంసీ చెకోపోస్ట్ వద్ద పోలీసులు 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో తిరుపతి దిశగా వెళుతున్న వ్యక్తి బ్యాగులో గంజాయి పట్టుబడిందని పోలీసులు తెలిపారు. సీఐ తిమ్మయ్య కేసు నమోదు చేసి పట్టుబడిన గంజాయిని MRO శ్రీదేవికి అప్పగించినట్లు తెలిపారు. వ్యక్తిని అరెస్టు చేశారు.