'సమాచార హక్కు చట్టంతో అవినీతిని నిర్మూలించాలి'

GDWL: సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ప్రభుత్వ వ్యవస్థలో అవినీతిని అంతం చేయడానికి ప్రజలను ప్రోత్సహించడం తమ లక్ష్యమని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ అన్నారు. శనివారం గద్వాలలో జరిగిన కమిటీ జిల్లా కార్యాచరణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. సమాచారం పొందే హక్కుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.