పలు షాపుల యజమానులకు జరిమానా విధించిన అధికారులు

పలు షాపుల యజమానులకు జరిమానా విధించిన అధికారులు

BPT: ప్లాస్టిక్ రహిత పట్టణం లక్ష్యంగా బాపట్ల మున్సిపల్ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. చాకలిపాలెం గేటు వద్ద ఉన్న చికెన్ షాపుల్లో మంగళవారం మున్సిపల్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాపుల్లో ప్లాస్టిక్ క్యారీబ్యాగులు గుర్తించి, పలు షాపుల యజమానులకు జరిమానాలు విధించారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.