సింగోటం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి
NGKL: కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ చింతకుంట నరసింహ(55) సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే ఛాతిలో నొప్పి రావడంతో హాస్పిటల్‌కి వెళ్లే క్రమంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన వెంటనే వైద్యులు పరిశీలించి మరణించినట్లు నిర్ధారించారు.