VIDEO: 101 ఫోన్స్ రికవరీ.. బాధితులకు అందజేత
SRPT: మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ఈరోజు ఎస్పీ కార్యాలయంలో మొబైల్ రికవరీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో అపహరణకు గురైన 101 సెల్‌ఫోన్లను బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ. 20 లక్షలు ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. ఎవరైనా దొంగ ఫోన్లను కొన్నా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.