ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తుల సమస్యలు

W.G: రహదారులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రహదారుల నిర్మాణం చేపట్టాలని మొగల్తూరు మండలం శేరేపాలెం గ్రామస్తులు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ను కోరారు. శుక్రవారం శేరేపాలెంలో పర్యటించిన సందర్భంగా స్థానిక మహిళలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే నాయకర్ కాలనీలోని రహదారులను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.