చిన్నారిని హత్య చేసిన కేసులో ఇద్దరికీ యావజ్జీవం

చిన్నారిని హత్య చేసిన కేసులో ఇద్దరికీ యావజ్జీవం

WGL: మూడేళ్ల పాప ఫాతిమా సబాను క్రూరంగా హత్య చేసిన కేసులో నిందితులు హజీరా బేగం, యూసుఫ్‌లకు వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డుగా ఉంటుందని 2022 ఏప్రిల్ 23న ఇద్దరూ కలిసి పాపను హతమార్చినట్లు సాక్ష్యాలతో నిరూపితమైంది. కేసు విచారణలో నేరం పూర్తిగా రుజువు కావడంతో కఠిన శిక్ష పడింది.