భారత్ నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రెట్టింపు
'మేడ్ ఇన్ ఇండియా' ఫోన్లకు అమెరికాలో ఫుల్ డిమాండ్ పెరిగింది. భారత్ నుంచి USకు స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఏకంగా రెట్టింపయ్యాయి. ఒక్క అక్టోబర్ నెలలోనే మనం రూ.13,230 కోట్ల విలువైన ఫోన్లను అమెరికాకు పంపించాం. ఐఫోన్ల తయారీ భారత్ లో పెరగడమే ఈ రికార్డుకు ప్రధాన కారణం. మన ఎగుమతులతో చైనా మార్కెట్‌కు గట్టి పోటీ ఇస్తున్నాం.