సొంత నిధులతో రహదారికి మరమ్మతులు

సొంత నిధులతో రహదారికి మరమ్మతులు

NRPT: కృష్ణ మండలం ముడుమాల్ గ్రామంలో సర్పంచ్ బాలరాజు, ఉపసర్పంచ్ జి.రంగమ్మ వెంకటేష్ ఆధ్వర్యంలో మంగళవారం రహదారి అభివృద్ధి పనులు చేపట్టారు. ఉపసర్పంచ్ తన సొంత నిధులతో దర్గా రోడ్డు నుంచి స్మశాన వాటిక వరకు ఉన్న కంపచెట్లను తొలగించి, గుంతలను పూడ్చించారు. ఈ చర్యతో పంట పొలాలకు వెళ్లే రైతులకు, స్మశాన వాటికకు వెళ్లే ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయి.