అనకాపల్లిలో రాయితీపై డ్రోన్లు సరఫరా

AKP: గ్రామాల్లో డ్రోన్లు అవసరమైన రైతులు గ్రూపులుగా ఏర్పడి తమను సంప్రదిస్తే రాయితీపై సరఫరా చేస్తామని అనకాపల్లి జిల్లా వ్యవసాయ అధికారి మోహనరావు ఆదివారం తెలిపారు. ఎరువులు పురుగు మందులు డ్రోన్ల ద్వారా పిచికారి చేస్తే సమయం ఖర్చు అవుతుందని అన్నారు. రైతులు నానో యూరియాకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నానో యూరియాను పూర్తి శాతం మొక్కలు గ్రహిస్తాయన్నారు.