చేపల మార్కెట్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

చేపల మార్కెట్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వాంబే కాలనీ డంపింగ్ యార్డ్ వద్ద రూ.8 కోట్లతో నిర్మించబోయే చేపల మార్కెట్ స్థలాన్ని గురువారం ఎమ్మెల్యే బోండా ఉమా పరిశీలించారు. పట్టణీకరణతో రద్దీ, డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యలతో బాధపడుతున్న చేపల వ్యాపారుల కోసం 2 ఎకరాలను కేటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పించామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్, కార్పొరేషన్ అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు.