తాగునీటిని క్లోరినేషన్ చేసి సరఫరా చేయాలి: MPDO
VZM: బొబ్బిలి MPDO రవికుమార్ శనివారం స్దానిక మెట్టవలసలో తాగునీటి సరఫరాను పరిశీలించారు. తాగునీరు వృధా చేయకుండా పొదుపుగా వాడాలని ప్రజలను కోరారు. క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పారిశుధ్య పనులను పరిశీలించి ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించాలని గ్రీన్ ఆంబాసిడర్లను సూచించారు.