సన్న బియ్యంతో సంతోషంగా భోజనం: ఎమ్మెల్యే

సన్న బియ్యంతో సంతోషంగా భోజనం: ఎమ్మెల్యే

NLG: నార్కెట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నకిరేకల్ ఎమ్మెల్మే వేముల వీరేశం సోమవారం సాయంత్రం ప్రారంభించారు. సన్నబియ్యంతో పేదలు సంతోషంగా భోజనం చేస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలాగే చౌడంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించాడు.