పంచాయతీ ఎన్నికల్లో మినహాయింపు లేదు

పంచాయతీ ఎన్నికల్లో మినహాయింపు లేదు

SRD: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులకు మినహాయింపు లేదని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఎన్నికల విధుల ఉత్తర్వులు అందుకున్న ప్రతి ఉపాధ్యాయుడు ఆయా మండలాల ఎంపీడీవో కార్యాలయంలో 13వ తేదీన రిపోర్టు చేయాలని చెప్పారు. కొందరికి మినహాయింపు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు.