నాగార్జున యూనివర్సిటీలో 49వ వ్యవస్థాపక దినోత్సవం

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గురువారం 49వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా పూర్వ ఉపకులపతులు ఆచార్య డి. రామకోటయ్య, ఆచార్య సి.వి. రాఘవులు, ఆచార్య ఎల్. వేణుగోపాల రెడ్డి, ఆచార్య వి. బాలమోహన్ దాస్, ఆచార్య వై.ఆర్. హరగోపాల్ రెడ్డి, ఆచార్య ఎ. రాజేంద్రప్రసాద్ పాల్గొని సందేశాలు అందించారు.