ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర మండల కేంద్రంలో లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఆ సందర్భంగా లబ్ధిదారులు వాకిటి యాదమ్మ, దొబ్బలి గిరిజ, ఫర్జీన్ బేగం, లక్ష్మమ్మ, ఎద్దుల మాధవిల ఇళ్లకు కలెక్టర్ విజయేందిర బోయితో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.