పిల్లలకు టీకాలు తప్పనిసరి: హుస్సేన్ రెడ్డి
NDL: పుట్టిన ప్రతి బిడ్డకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని బుధవారం హెల్త్ ఎక్స్‌టన్షన్ ఆఫీసర్ హుస్సేన్ రెడ్డి అన్నారు. మహానందిలో చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు టీకాలు వేశారు. ఎండాకాలంలో వడదెబ్బ నుంచి తట్టుకునేందుకు ORS ద్రావణం తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఇది ఉచితంగా లభిస్తుందని తెలిపారు.