అనాథ ఆశ్రమాలను తనిఖీ చేసిన జడ్జి

NRPT: పట్టణంలోని అనాథ పిల్లలను, వృద్ధుల ఆశ్రమాన్ని శుక్రవారం సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. వంట గదిలో ఆహార పదార్థాలను పరిశీలించారు. పిల్లలు, వృద్ధులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. శుద్ధమైన త్రాగునీరు అందించాలని, పౌష్టికాహారం అందించాలని చెప్పారు.