విశాఖకు మరో ఐటీ క్యాంపస్..!
విశాఖలో మరో IT క్యాంపస్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాపులుప్పాడలో రూ. 115 కోట్లతో, 2వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ PTకు అనుమతిచ్చింది. అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్, AI/ML, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ విభాగాలతో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది. రెండేళ్లలో తొలి దశ పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది.