తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

తప్పిపోయిన చిన్నారిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

కామారెడ్డికి చెందిన విభూతి రమేష్, దివ్యల నాలుగేళ్ల కుమార్తె పల్లవి ఆడుకుంటూ బయటకు వెళ్లి తప్పిపోయింది. గాంధీనగర్ కాలనీలో మహమ్మద్ మోసిన్, భరత్ కుమార్‌లకు కనిపించిన పాపను వారు సీఐ నరహరికి శనివారం అప్పగించారు. వాట్సాప్ గ్రూప్‌లో ఆమె ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో పాప తల్లిదండ్రులు సమాచారం తెలుసుకుని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమ కుమార్తెను సురక్షితంగా తీసుకెళ్లారు.