విమానాలు రద్దు.. రంగంలోకి DGCA

విమానాలు రద్దు.. రంగంలోకి DGCA

దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. విమానాల ఆలస్యం, రద్దుపై వివరణ ఇవ్వాలని ఇండిగో సంస్థకు DGCA సమన్లు జారీ చేసింది. మధ్యాహ్నం కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. క్యాబిన్ సిబ్బంది, పైలట్ రోస్టర్ నియమాల వల్లే సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇండిగో వెల్లడించింది. రెండు రోజుల్లో సాధారణ స్థితికి వస్తుందని స్పష్టం చేసింది.