VIDEO: యాదమరిలో ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు
CTR: 'మొంథా' తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల అవకాశం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని యాదమరి తహసీల్దార్ పార్థసారథి సూచించారు. మండలంలోని 59 చెరువుల్లో 27 చెరువులు నిండగా, నివా-మరవసాగి నదుల్లో ప్రవాహం తీవ్రంగా ఉందని తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.