నేడే ఛైర్మన్ ఎన్నిక.. నిర్మల్‌లో టెన్షన్.. టెన్షన్
NRML: నిర్మల్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం 12.30కి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను నిర్వహించనున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. నిన్నటి ఛైర్మన్ ఎన్నికనే ఫైనల్ చేయాలని BJP, BRS కూటమి పట్టుబడుతోంది. ఛైర్మన్ అభ్యర్ధిగా కౌన్సిలర్ అంకం మౌనికను బీజేపీ ప్రతిపాదించింది.