డిప్యూటీ సీఎం కొలుకోవాలని ప్రత్యేక పూజలు
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు ప్రాంతాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన నాయకులు డీఎన్ఎల్ ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా అప మృత్యుంజయ హోమం, శ్రీ చక్ర నవ వర్ణ అర్చన, ఏకాదశ వర రుద్రాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు.