గుంటూరులో రోడ్డు ఆక్రమణలు తొలగింపు

GNTR: గుంటూరు అరండల్‌పేటలో రోడ్డును ఆక్రమించి నిర్వహిస్తున్న దుకాణాలపై మంగళవారం నగరపాలక కమిషనర్ పులి శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రోడ్డంతా పూర్తిగా ఆక్రమించినట్టుగా గుర్తించి, వెంటనే ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించడంతో మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు.