విజయ్ దేవరకొండ ‘రణబాలి’ వీడియో లీక్
విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘రణబాలి’ మూవీ షూటింగ్ వీడియో ఒకటి SMలో లీక్ అయి హల్చల్ చేస్తోంది. ఇందులో 'నాకొడకా.. యాడుండువ్ రా.. నీ ఇళ్లలోకి వచ్చినా..రాప్పా' అంటూ విజయ్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆయన డైలాగ్ డెలివరీ, మాస్ యాటిట్యూడ్ చూస్తుంటే ఈసారి బాక్సాఫీస్ వద్ద గట్టిగా కొట్టేలా ఉన్నాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.