కళాకారులకు వసతులు కల్పించాలని వినతి

KDP: ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలోని భజన కళాకారులకు మౌలిక వసతులను కల్పించాలని శుక్రవారం ఒంటిమిట్ట దేవస్థానం టీటీడీ, డీపీవో ప్రశాంతికి ఉమ్మడి కడప జిల్లా కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాంబశివ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని TTD, DPO హామీ ఇచ్చారని కళాకారులు అన్నారు.