రూ.7 లక్షల నిధులతో UGD పనులకు శంకుస్థాపన
MDCL: కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కాప్రా డివిజన్ పరిధిలోని మహమ్మదీయ కాలనీలో రూ.7 లక్షల నిధులతో చేపట్టిన యూజీడి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని ప్రతి సమస్యను పరిష్కరించి అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.