మిస్ వరల్డ్ పోటీలపై పీవీ సింధు కామెంట్స్

హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మూడు వారాలపాటు కొనసాగనున్న ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు సందడి చేయనున్నారు. తాజాగా ఈ పోటీలపై బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్పందించింది. ఇంతకుముందు లేని విధంగా హైదరాబాద్ వేదికగా ఓ అద్భుతమైన వేడుక జరగనుందని తెలిపింది. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేందుకు ఇదో మంచి సందర్భం అని వెల్లడించింది.