పోగొట్టుకున్న ఫోన్‌లు బాధితులకు అందజేత
భూపాలపల్లి పట్టణానికి చెందిన నలుగురు ఇటీవల తమ సెల్ ఫోన్లను పోగొట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు CEIR పోర్టల్ ద్వారా వాటిని గుర్తించారు. ఈరోజు సీఐ నరేష్ చేతుల మీదుగా సెల్ ఫోన్లను బాధితులకు అందించారు. స్టేషన్‌కు పోగొట్టుకున్న ఫోన్ల అప్లికేషన్లు 300కి పైగా CEIR పోర్టల్ ద్వారా రాగా.. 170కి పైగా ఫోన్లను దొరకపెట్టి బాధితులకు అందించామని సీఐ తెలిపారు.