అంగన్వాడీ సెంటర్లో అన్నప్రాసన
MDK: కౌడిపల్లి మండలం సలాబత్పూర్ అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం చిన్నారులకు అన్నప్రాసన చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. తల్లిపాల తర్వాత శిశువులకు పౌష్టికాహారాన్ని పరిచయం చేయడం ఎంతో ముఖ్యమని, తద్వారా పౌష్టికాహార లోపాన్ని నివారించవచ్చని తెలిపారు. పిల్లల పెరుగుదలలో అంగన్వాడీల పాత్ర కీలకమన్నారు.