కోతులను పట్టిస్తున్న గ్రామస్తులు

కోతులను పట్టిస్తున్న గ్రామస్తులు

MLG: మల్లంపల్లి మండలంలో కోతుల భారీ నుంచి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు వెల్లడించారు. గ్రామంలోని ఇళ్లపైకి ఎక్కి ఆహార పదార్థాలను ధ్వంసం, మహిళలను భయపెట్టడం వంటి ఘటనలు పెరగడంతో గ్రామస్తులు ముందుకొచ్చారు. ప్రతీ ఇంటి కి₹100 నుంచి ₹300 వరకు డబ్బులు సేకరించి కోతులు పట్టే వారికి ఇచ్చి వారి సహాయంతో కోతులను అడవికి పంపిస్తున్నట్లు తెలిపారు.