ఎమ్మెల్యేను సన్మానించిన MEF నాయకులు

SS: మడకశిర పట్టణంలోని రోడ్లు భవనాలు విశ్రాంతి భవనము నందు రాష్ట్ర కార్యదర్శి భూతన్న, జిల్లా కార్యదర్శి V.N.మాలింగప్ప ఆధ్వర్యంలో మడకశిర ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ మెంబర్ MS.రాజును MEF నాయకులు సన్మానించారు. వారు మాట్లాడుతూ.. SC వర్గీకరణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం పొందడానికి మాల మాదిగ ఎమ్మెల్యేలను సమన్వయం చేస్తూ, ప్రభుత్వానికి దళితులకు మధ్య సంధానకర్తగా రాజు వ్యవహరించరన్నారు.