అద్దెలు చెల్లించి అభివృద్ధికి తోడ్పాటు అందించండి

NLR: బుచ్చినగర పంచాయతీ కార్యాలయంలో దుకాణాల వేలంపాట కార్యక్రమం జరిగింది. పట్టణంలోని వ్యాపారస్తులు పాటలో పాల్గొని పోటాపోటీగా వేలంపాటలు పాడారు. ఇందులో భాగంగా కొందరు వేలంపాటలు దుకాణాలను దక్కించుకున్నారు. కమిషనర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. సరైన సమయంలో అద్దెలు చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు.