VIDEO: యూరియా అధిక వాడకం రైతులకు ముప్పు

VIDEO: యూరియా అధిక వాడకం రైతులకు ముప్పు

NLR: సంగం మండలం దువ్వూరు గ్రామాల్లో రైతులకు యూరియా అధిక వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా MAO శశిధర్ మాట్లాడుతూ.. యూరియా అధిక మోతాదులో వాడితే భూమి సారవంతం తగ్గిపోతుందన్నారు. పంటలు మొదట్లో పచ్చగా కనిపించినా తరువాత దిగుబడులు తగ్గిపోతాయని రైతులకు సూచించారు. భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సేంద్రియ ఎరువులు వాడాలని తెలియజేశారు.