హెచ్‌-1బీ వీసాలకు ట్రంప్‌ మద్దతు.. కానీ: వైట్‌హౌస్‌

హెచ్‌-1బీ వీసాలకు ట్రంప్‌ మద్దతు.. కానీ: వైట్‌హౌస్‌

H1-B వీసాలను సమర్థిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై వైట్‌హౌస్ స్పందించింది. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను ఇంకొకరితో భర్తీ చేయడాన్ని ట్రంప్ సమర్థించటం లేదని చెప్పింది. అగ్రరాజ్యంలో పెట్టుబడి పెట్టే కంపెనీలు తొలుత విదేశీ ఉద్యోగులను నియమించుకున్నా.. ఆ తర్వాత వారి స్థానాన్ని అమెరికన్లతో భర్తీ చేయాల్సిందేనని ఆదేశించినట్లు తెలిపింది.