పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే ఉద్దేశం
ASR: పేదలకు సొంతింటి కలను నిజం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని కొయ్యూరు ఎంపీడీవో ప్రసాదరావు అన్నారు. సోమవారం పీఎం జన్ మన్ పథకం ద్వారా పూర్తయిన ఇళ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు ఉమామహేశ్వరరావు, గోవిందరావు, పంచాయతీ అభివృద్ధి అధికారి రాంబాబు పాల్గొన్నారు