'నిబంధనలను అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు'

'నిబంధనలను అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు'

VKB: రెండో విడత ఎన్నికల ప్రచారానికి అనుమతి ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగిసిందని SP స్నేహ మెహ్రా తెలిపారు. శుక్రవారం SP మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కగా పాటించాలని అన్నారు. ఇకపై ప్రచారాలు, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే కార్యక్రమాలు చేయవద్దన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.