వర్షం ధాటికి నేలకొరిగిన విద్యుత్ స్తంభం
MDCL: కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్ పద్మనగర్ ఫేజ్-2లో అకాల వర్షం, గాలివాన బీభత్సం సృష్టించాయి. ఈదురు గాలుల ధాటికి ఒక భారీ వృక్షం కూలిపోవడంతో పాటు విద్యుత్ స్తంభం నేలకొరిగింది. ఈ ప్రమాదంలో అక్కడ నిలిపి ఉంచిన పలు వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని స్థానికులు పేర్కొన్నారు.