వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు వహించండి: కలెక్టర్
VKB: ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దన్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్నందున నీటిని పొదుపుగా వాడటంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.