కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
SRCL: కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో అలస్యంగా చోటుచేసుకుంది. ఎస్సై ఉపేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్‌కు చెందిన ఎల్ల రమేష్(48) ఏ పని చేయకుండా మద్యం సేవిస్తూ అప్పులు చేశాడు. ఈ క్రమంలో మృతుని భార్య ఏదైనా పని చేయమని మందలించగా ఈనెల 3న బయటకు వెళ్లి మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.