విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి: కలెక్టర్

MLG: విద్యార్థులు క్రీడల్లో గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎదగాలని జిల్లా కలెక్టర్ దివాకర్ కోరారు. ములుగు మండలం జాకారంలో సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలను మంగళవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యతోపాటు క్రీడల్లో రాణించినప్పుడే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.