మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టాలి: కలెక్టర్

మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టాలి: కలెక్టర్

MBNR: జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను కఠినంగా అరికట్టాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు.