రేపు శానిటేషన్ డ్రైవ్
AKP: జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈనెల 10న రెండు పంచాయతీల్లో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.