బీఆర్ఎస్ ఉనికి కాపాడుకునేందుకే సభ: జగ్గారెడ్డి

SRD: బీఆర్ఎస్ వనికి కాపాడుకునేందుకు సభ నిర్వహించారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. డూప్లికేట్ గాంధీలు అనడం ఆశ్చర్యం అనిపించిందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.