ఆరుగురు జూదరులు అరెస్ట్: ఎస్సై

ఆరుగురు జూదరులు అరెస్ట్: ఎస్సై

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలో అక్కివలస గ్రామ చివరిలో పేకాట శిబిరంపై ఎస్సై బాలరాజు తన సిబ్బందితో సోమవారం సాయంత్రం దాడి చేశారు. ఈ దాడిలో 6 గురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ. 8,650 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. జూదం ఆడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.