VIDEO: హైవేపై మద్యం మత్తులో కానిస్టేబుల్ వీరంగం..!
NTR: ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి హైవేపై ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో వేగ నియంత్రణ బారికేడ్లను ఢీకొట్టాడు. ఇది గమనించిన ఓ యువకుడు వెంటనే అడ్డుకుని నిలదీశాడు. సమాజాన్ని బాగుచేయాల్సిన పోలీసులే ఇలా తాగి తందనాలాడితే ఎలా అంటూ వాగ్వాదానికి దిగాడు. కానిస్టేబుల్‌కు వెంటనే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించాలని పట్టుబట్టడంతో హైవేపై కాసేపు ఉద్రిక్త నెలకొంది.