అండర్-14 క్రికెట్ జట్టుకు రైల్వే బాలుడు ఎంపిక

అండర్-14 క్రికెట్ జట్టుకు రైల్వే బాలుడు ఎంపిక

VSP: ఆంధ్రప్రదేశ్ అండర్-14 క్రికెట్ జట్టుకు ఎంపికైన 13 ఏళ్ల యువ క్రికెటర్ పి. యశిల్ విగ్నేష్‌ను విశాఖ వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా అభినందించారు. రైల్వే ఉద్యోగి వై. మధు కుమారుడైన యశిల్, రైల్వే క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఉత్తమ ప్రతిభ కనబరిచాడు.