ట్రాఫిక్ భద్రతపై అవగాహన కార్యక్రమం

KDP: “వేగం కన్నా ప్రాణం మిన్న” అని, ఒక్క క్షణపు నిర్లక్ష్యం ప్రాణనష్టం కలిగించవచ్చని కడప ట్రాఫిక్ సీఐ జావీద్ హెచ్చరించారు. శుక్రవారం కడపలోని వివేకానంద మహిళా డిగ్రీ కళాశాలలో ట్రాఫిక్ భద్రతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధారణ, వేగ పరిమితి, సెల్‌ఫోన్ వాడకం నిషేధం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్స్ వంటి నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.